India Vs New Zealand,2nd T20 : Rohit Sharma Says We Learnt From Our Mistakes | Oneindia Telugu

2019-02-09 88

Rohit Sharma led from the front with a 29-ball 50 as India crushed New Zealand by 7 wickets to avenge the Wellington humiliation. India have now drawn level in the 3-match T20I series. Earlier, Krunal Pandya starred with the ball to pick 3 for 28 off 4 overs.
#IndiaVsNewZealand2ndT20
#MSDhoni
#Krunalpandya
#Rohithsharma
#hardikpandya
#DarylMitchell
#ColinMunro
#KaneWilliamson

న్యూజిలాండ్ గడ్డపై టీ20 తప్పిదాల నుంచి భారత్ జట్టు చాలా వేగంగా పాఠాలు నేర్చుకుందని మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వెల్లడించాడు. న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌‌ గెలుపు అవకాశాల్ని భారత్ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు అర్ధశతకం బాదడంతో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ విజేత నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. గత బుధవారం జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. రికార్డుల పరంగా టీమిండియాకి ఇదే అతి పెద్ద ఓటమి.